ప్రకాశం: పొన్నలూరు మండలంలో ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన ( PMAGY) క్రింద ఎంపిక కాబడిన ఉప్పలదిన్నె గ్రామ పంచాయతీని శనివారం ఎంపీడీవో సుజాత సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఉప్పలదిన్నె గ్రామపంచాయతీకి సాంఘిక సంక్షేమ శాఖ నుండీ 20 లక్షల మంజూరు కాగా విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.