ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.
రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు.దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కామెంట్స్ చేస్తారా అని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని నిలదీశారు. పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అక్కడి ప్రభుత్వ ఆఫీసులను పేల్చేస్తారా? అంటూ ప్రశ్నించారు.