సూర్యాపేట జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మేళ్లచెరువుకు చెందిన జనిగె సతీష్, నర్సింహారావు మృతి చెందారు. చివ్వెంల ముత్యాలమ్మ గుడి నుంచి దురాజ్ పల్లి వెళ్తుండగా వీరి బొలెరోను DCM ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు విచారణ చేపట్టారు.
PDPL: కాల్వ శ్రీరాంపూర్ MPDO కార్యాలయంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కార్మికులు, మధ్యలో బడి మానివేసిన విద్యార్థుల సమస్యలపై చర్చించారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో MPDO, MEO, ASI, మెడికల్ ఆఫీసర్, మహిళా సాధికారత అధికారులు పాల్గొన్నారు.
MNCL: మందమర్రిలోని 8వ వార్డుకు చెందిన కర్నాల ఇందిర అనే వృద్ధురాలు అదృశ్యమైంది. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసిన వారు 8712656570 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
SRCL: తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఈనెల 18న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి పిలుపునిచ్చారు. మంగళవారం వేములవాడలోని కార్యా లయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు, కళాకారులు, కవులు, సాహితీవేత్తలు రావాలన్నారు
నిర్మల్: జిల్లా కేంద్రంలో వేసవి క్రీడలను నిర్వహించేందుకు అర్హులైన PETల నుంచి, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DYSO శ్రీకాంత్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 15వ తేదీలోగా కలెక్టరేట్ DYSO కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అర్హులను ప్రకటించి వేసవి క్రీడా శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
NZB: ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరు గడువు అని సిరికొండ ఎంపీడీవో మనోహర్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పత్రాలను మరుసటి రోజు ఉదయం 11 గంటలలోపు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
NLG: ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 7 డిపోల పరిధిలో నిత్యం 2,82,150 మంది ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరిగినా, దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులకు తోపులాట తప్పడం లేదు. గత 3నెలలుగా ‘డయల్ యువర్ ఆర్ఎం’ నిర్వహించకపోవడంతో సమస్యలు చెప్పుకోవడానికి వీలులేకుండా పోయింది.
MHBD: పట్టణ కేంద్రంలోని ‘ఓం శ్రీమన్నారాయణ చిట్ ఫండ్’ పేరుతో ప్రజలను మోసం చేసిన మంగీలాల్, అతడి భార్య సావిత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ CI మహేందర్ రెడ్డి తెలిపారు. భాధితుల నుండి సుమారు రూ. 80 లక్షలు వసూలు చేసి.. తిరిగి ఇవ్వకుండా బాధితులను వేధిస్తున్నట్లు CI పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు CI వెల్లడించారు.
MDK: మెదక్ ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానన్నారు. ప్రయాణికులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 78426 51592 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
JGL: ధర్మపురి మండలం నేరేళ్ల, గోవిందుపల్లె గ్రామాల్లో మున్నూరు కాపు కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఆ సంఘ ప్రతినిధులు విన్నవించారు. మంగళవారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 2 గ్రామాల మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.
NZB: టీయూ పరిధిలో డిగ్రీ (BA/ BCom/ BSc/ BBA) విద్యార్థుల రెగ్యులర్ 2, 4, 6, బ్యాక్ లాగ్ 1, 3, 5 (2021 నుంచి 2025 వరకు) సెమిస్టర్ల పరీక్ష ఫీజుల, పొడిగించిన చెల్లింపుల గడువు నేటితో ముగియనున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇది వరకే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు తమ ఫీజులు చెల్లించాలన్నారు.
NRML: జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని నిర్మల్ జిల్లా DPRO విష్ణువర్ధన్ ప్రకటనలో తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ నెలలోనే అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
MNCL: సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ.12.60 లక్షలు కేటాయించగా.. ఇందులో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ.లక్ష చొప్పున, జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు రూ.50 వేలు కేటాయించారు.
NLG: ఓపెన్ స్కూల్ ఇంటర్ పదవ తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 20 నుంచి 27 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షలు 28 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు ఇంటర్లో 2226, పదో తరగతిలో 1611 మంది పరీక్ష రాయనున్నారు.
ASF: జిల్లా కలెక్టరేట్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.