• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సమతా కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి

HYD: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో సమతా కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రాన్స్ జెండర్లకు ఈఆర్ఎస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు.

April 9, 2026 / 01:01 PM IST

శిల్పారామంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం

HYD: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా హైటెక్ సిటీలోని శిల్పారామంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో 200 కిలోల మున్సిపల్ వ్యర్థాలు, 50 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. జిల్లా పర్యాటక అధికారి ఎస్. ప్రభాకర్, స్విచ్చెకో బృందం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సేవకులు భారీగా పాల్గొన్నారు.

April 9, 2026 / 12:59 PM IST

గాంధారి SIగా మహేందర్ బాధ్యతల స్వీకరణ

KMR: గాంధారి పోలీస్ స్టేషన్ SIగా  ఎం. మహేందర్ బాధ్యతలు చేపట్టారు. బీర్కూర్ PS నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన బీ. ఆంజనేయులు పిట్లంకు బదిలీ అయ్యారు. మహేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

April 9, 2026 / 12:53 PM IST

పైనుంచి ఎండ.. రోడ్డు సెగతో నరకం

HYD: పీక్ అవర్స్‌లో నగరంలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. PVNR ఎక్స్‌ప్రెస్‌వే నుంచి NMDC వైపు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పైనుంచి ఎండ, రోడ్డుసెగకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రయాణికులు ముందుగానే ప్రణాళికలు చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు.

April 9, 2026 / 12:51 PM IST

గురుకులాల్లో ప్రతిభ కనబరిచిన కిన్నెరపల్లి విద్యార్థులు

ADB: బజారుహత్నూర్ మండలంలోని MPUPS కిన్నెరపల్లె విద్యార్థులు ఇటీవల నిర్వహించిన గురుకులాల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు విద్యార్థులు వాగ్మారె దివ్య, హృష్ణాలే భాగ్యశ్రీ, సూర్యావంశీ రూపాలి, హరిగిలే సుమిత్‌లను పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయ్ కుమార్, సిబ్బంది తదితరులున్నారు.

April 9, 2026 / 12:49 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

KMM: ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో కట్టకూరు రోడ్‌లో గల వడ్డేం సుగుణమ్మ పొలంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్‌ను సర్పంచ్ చెరుకుపల్లి జగన్నాధం గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివరాత్రి రాంబాబు, వార్డు సభ్యులు కొలికపొంగు మాధవరావు, ఏఈవో మౌనిక, VOA లు, సమైక్య అధ్యక్షులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 12:47 PM IST

త్వరలోనే ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు!

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు త్వరలోనే స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి జిల్లా నుంచి ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసి, మొదటి విడతలో 5 లక్షల మందికి ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

April 9, 2026 / 12:47 PM IST

వరంగల్‌లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ

WGL: ప్రజాపాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం వరంగల్‌లో కెఎంసీ నుంచి ఎంజీఎం వరకు “ఎయిడ్స్ అవేర్నెస్ & ప్రివిషన్స్ క్యాంపెనింగ్ డే” ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యశారద జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం కూడలి వద్ద మానవహారంలో పాల్గొన్నారు. ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత కీలకమని తెలిపారు. ఉచిత హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు.

April 9, 2026 / 12:44 PM IST

పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

BHNG: చౌవుళ్ళ రామారంలో ఇవాళ పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందుల కిరణ్, రైతులు పాల్గొన్నారు.

April 9, 2026 / 12:41 PM IST

కోదండరామాలయానికి గోమాత దానం

WNP:  గోపాల్‌పేటలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి నలువోతుల వెంకటేష్ రూ.30 వేల విలువైన గోవును దానంగా ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ దానం చేశారు. అర్చకుడు రంగాచార్యులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీకరించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

April 9, 2026 / 12:41 PM IST

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల కోసం సభ్యత్వం

NZB: పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదలైన సందర్భంగా సభ్యత్వ రుసుం రూ.400 చెల్లించాలని ఛైర్మన్ డాక్టర్ మోహన్, కార్య దర్శి కర్తన్ గణేశ్యామ్ తెలిపారు. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ రెండు కలర్ ఫోటోలతో పాటు రూ.400 చెల్లించాలన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 వరకు సమర్పించాలని చెప్పారు.

April 9, 2026 / 12:39 PM IST

కొమరంభీంకు ఘనంగా నివాళులు

NRML: కొమరం భీం వర్ధంతి సందర్భంగా గురువారం నిర్మల్ పట్టణం కొమరం విగ్రహం వద్ద ఆదివాసి హక్కుల జేఏసీ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య, మంద మల్లేష్, చిన్నయ్య, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 12:38 PM IST

పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన కార్పోరేటర్

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్ కార్పొరేటర్ బండి నరసింహారావు గురువారం పారిశుద్ధ్యం పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మెదరబస్తిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా దోమల నివారణకై కాలువలలో టిమోపాస్ దోమల మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజలు వారంలో ఒకరోజు డ్రైడేను పాటించాలని నీరు నిలువ లేకుండా చూడాలన్నారు.

April 9, 2026 / 12:37 PM IST

దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు పంపిణీ

SDPT: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా HYD కలెక్టరేట్‌లో ‘సమతా కిచెన్’ ను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రాన్స్ జెండర్లకు ఈఆర్ఎస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొన్నారు.

April 9, 2026 / 12:36 PM IST

ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

KMM: ముదిగొండ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 30పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం పనులు గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. వారం పనుల పురోగతికి ప్రణాళికలు వేసుకుని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. నిర్మాణ ప్రాంగణం మొత్తం కలియదిరిగి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.

April 9, 2026 / 12:35 PM IST