• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పెళ్లికి ఐదు రోజుల ముందే ఆత్మహత్య

HYD: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలికి చెందిన వెంకటకృష్ణ శ్రీ సాయి అనే యువకుడికి పెళ్లి కుదిరింది. అయితే, పెళ్లికి ఐదు రోజులు మాత్రమే ఉండగా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ బలవన్మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 8, 2026 / 03:04 PM IST

జమ్మికుంట మార్కెట్‌లో సల్పంగా పెరిగిన పత్తి ధరలు

KNR జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు మార్కెట్ కు మొత్తం 5 వాహనాల్లో 45 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠంగా రూ.7900, కనిష్ఠంగా రూ.6,500 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు. అధికారులు పత్తి ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

April 8, 2026 / 03:02 PM IST

అంబేద్కర్ అవార్డు గ్రహీతకు సన్మానం

PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ వాణి పత్రికా రిపోర్టర్ సుంచు మల్లేశం ఇటీవల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇవాళ బంజేరుపల్లి తండా ఆల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో మల్లేశంను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.

April 8, 2026 / 03:01 PM IST

లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం: చుక్కా రాములు

SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది ఒక్క సీఐటీయు మాత్రమే అని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

‘జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి’

NRPT: జిల్లాలో తెలంగాణ జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట పట్టణ జాగృతి పార్టీ అధ్యక్షుడిగా చంద్రు ముదిరాజ్‌కు జిల్లా కార్యాలయంలో బుధవారం నియామక పత్రాన్ని అందించారు. పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత సారథ్యంలో పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

ప్రెస్ క్లబ్ స్థలానికి వినతి పత్రం అందజేత

NRPT: మద్దూరు మండలంలో జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 150 గజాల స్థలం కేటాయించాలని కోడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఏనుమల తిరుపతిరెడ్డికి జర్నలిస్టుల సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన స్థలం కేటాయింపుపై రెవెన్యూ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షుడు విజయకుమార్, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

తప్పిన ప్రమాదం.. రోడ్డుపై బియ్యం సంచులు

MDK: రామాయంపేట ఎఫ్‌సీఐ గోదాం నుంచి దంతేపల్లి వెళ్తున్న బియ్యం లారీ క్యాట్రియాల శివారులోని గుంతల రోడ్డు కారణంగా కుదుపునకు లోనైంది. దీంతో లోడులోని బియ్యం సంచులు ఒక్కసారిగా రోడ్డుపై జారిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది వెంటనే స్పందించి బస్తాలను తిరిగి లారీలోకి చేర్చారు. లోడ్ అజాగ్రతగా తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 8, 2026 / 03:01 PM IST

పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం

SDPT: బెజ్జంకి మండలం గుండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీనివాస్, హెచ్‌ఎం నాగవేణి పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

గొల్లపల్లి సభకు అనుమతి రద్దు

WNP: రేవల్లి మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేకంగా రైతుల దీక్షలకు మద్దతుగా జరగాల్సిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 9న జరగాల్సిన సభలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనాల్సి ఉంది. అనుమతి రద్దును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ విమర్శించారు. హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

April 8, 2026 / 03:01 PM IST

భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

GDWL: కేటి దొడ్డి మండలం ఇక్కిచేడు గ్రామంలో బుధవారం భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు వర్షిత్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13న నిర్వహించనున్న ‘4వ అంబేడ్కర్ ఆలోచన పండుగ’కు సంబంధించి ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

April 8, 2026 / 03:01 PM IST

తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్‌లో నూతనంగా నిర్మించిన రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభించారు. కార్యాలయ సదుపాయాలను పరిశీలించి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వినయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

గోటుర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: ధన్వాడ మండలం గోటూర్ గ్రామంలోని కుమ్మరి గేరిలో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం గ్రామ సర్పంచ్ నాగమణి ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం (NREGS) నిధులు రూ. 5 లక్షలతో ఈ పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

April 8, 2026 / 03:01 PM IST

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

KMR: పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతినగర్ 3వ వార్డులో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ తక్షణమే స్పందించారు. ప్రజల ఇబ్బందులను గమనించి వెంటనే కొత్త బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించారు. సర్పంచ్ చూపిన ఈ సమయస్ఫూర్తిని, సేవా దృక్పథాన్ని స్థానిక గ్రామస్థులు హర్షిస్తూ, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

April 8, 2026 / 03:00 PM IST

నూతన తహసీల్దార్‌కు సమస్యలు విన్నపం

NLG: చిట్యాల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్‌ను బీజేపీ నేత చికిలంమెట్ల అశోక్ కలిసి స్థానిక సమస్యలను విన్నవించారు. 241 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. సాదాబైనామా, భూ సమస్యలు పరిష్కరించాలని, అమృత్ 2.0 కింద నీటి ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

April 8, 2026 / 03:00 PM IST

‘పిచ్చి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న పిచ్చి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు కోరారు. నేడు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు వారు చెప్పారు. RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. నగరంలో పిచ్చికుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతోందన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

April 8, 2026 / 02:55 PM IST