• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: కౌన్సిలర్

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కౌన్సిలర్ సరిత ఆంజనేయులు తెలిపారు. బుధవారం బహార్పేట చౌరస్తా సమీప కాలనీల్లో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను మున్సిపాలిటీ సిబ్బందితో శుభ్రం చేయించారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలో ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

April 8, 2026 / 01:16 PM IST

బెజుగామ టూ గజ్వేల్.. కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

SDPT: గజ్వేల్ మండలంలోని బెజుగామ గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆక్షన్ రెడ్డి చొరవతో బెజుగామ నుంచి గజ్వేల్ వరకు నూతన బస్సు సౌకర్యాన్ని ఈరోజు ప్రారంభించారు.

April 8, 2026 / 01:15 PM IST

విద్యుత్ స్తంభాల ఏర్పాటు.. కాలనీలో వెలుగులు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ 13వ వార్డులో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో వెలుతురు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాలనీలో నూతనంగా 5 విద్యుత్ స్తంభాలు వేయడంతో రాత్రి సమయాలలో ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. వార్డును నెంబర్ వన్‌గా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు కౌన్సిలర్ అన్నారు.

April 8, 2026 / 01:12 PM IST

జిల్లాలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

ADB: జిల్లాలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38°C నుంచి 40°C వరకు నమోదవుతుండగా, రాబోయే రోజుల్లో 42°C దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ వేడి గాలులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎండ నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 8, 2026 / 01:11 PM IST

ఫిర్యాదులు పెట్టెకు స్పందించిన కలెక్టర్

WGL: జిల్లా కేంద్రంలోని MGM ఆసుపత్రిలో కలెక్టర్ సత్య శారద ఇటీవల ఫిర్యాదులు పెట్టే పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఫిర్యాదుల పెట్టెను తెరవగా.. ఆ పెట్టాలో ఓ లెటర్ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చే మాదిరిగా ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.

April 8, 2026 / 01:11 PM IST

మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ

MDK: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల వంటి భారీ ఎత్తిపోతల పథకాల్లో మోటార్లను పదేపదే ఆన్, ఆఫ్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వైబ్రేషన్స్ పెరిగి పంపులు, మోటార్లు పాడైపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

April 8, 2026 / 01:07 PM IST

వనపర్తిలో రాజకీయ వేడి ఇంకా రగులుతుందా..?

WNP: వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో గోనూరు వెంకటయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన బస్సు సెంటర్ ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముందుగానే కార్యక్రమా స్థలానికి చేరుకొని గంటకు పైగా వేచి చూశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే నాయకుల మధ్య అసంతృప్తి నిరాశతో వెళ్లడం పార్టీకి నష్టం అన్నారు.

April 8, 2026 / 01:05 PM IST

సాఫ్ట్వేర్ సాకుతో వేతనాల నిలుపుదల అన్యాయం

NLG: ఉపాధి హామీ కూలీలకు రెండు పూటల ఫోటో విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామితో కలిసి ఇవాళ పనులను పరిశీలించిన ఆయన, సాఫ్ట్‌వేర్ సాకుతో వేతనాలు నిలిపివేయడం అన్యాయమన్నారు. కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని, పనిముట్లు సరఫరా చేయాలని కోరారు.

April 8, 2026 / 01:02 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ

సిరిసిల్ల: పట్టణంలో చలివేంద్రాన్ని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాలు చాలా కీలకమన్నారు. ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తీవ్రమైన ఎండలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు.

April 8, 2026 / 01:02 PM IST

ఉచిత వైద్య శిబిరం.. ప్రజలకు మందుల పంపిణీ

RR: చేవెళ్ల మండలం రావులపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శిబిరంలో పాల్గొన్నారు. వైద్యులు గ్రామ ప్రజలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరాన్ని నిర్వహించటం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు.

April 8, 2026 / 12:59 PM IST

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడలోని శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయం బోనాల మొక్కులు చెల్లించుకునే భక్తులతో రద్దీగా మారింది. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం నైవేద్యం సమర్పించి తరిస్తున్నారు. క్యూలైన్లు, ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారికి నైవేద్యం, ఒడి బియ్యం, కల్లు సమర్పిస్తున్నారు.

April 8, 2026 / 12:51 PM IST

‘పేదలకు వరం ఇందిరమ్మ ఇండ్లు’

KMR: పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని చింతామణిపల్లి సర్పంచ్ సిద్ధిరాములు అన్నారు. బుధవారం గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. గ్రామంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పనిచేస్తుందని అన్నారు.

April 8, 2026 / 12:48 PM IST

హిందూ సమ్మేళనానికి రావాలని స్వామీజీకి ఆహ్వానం

NRPT: ఈ నెల 29న నర్వ మండల కేంద్రంలో నిర్వహించనున్న ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమానికి రావాల్సిందిగా అంభాత్రయ క్షేత్ర వ్యవస్థాపకుడు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామికి బుధవారం నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారు మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సమ్మేళనంలో భక్తులు, హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

April 8, 2026 / 12:47 PM IST

కేశవరావును పరామర్శించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్

HNK: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల కేశవరావు మాతృమూర్తి తిరుపతమ్మ ఇటీవల మరణించగా హనుమకొండలో తిరుపతమ్మ చిత్రపటానికి ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పోచంపల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

April 8, 2026 / 12:47 PM IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: మంత్రి వెల్లడి

NLG: నల్లగొండ పట్టణం మాన్యంచల్కలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా పట్టణ వాసులకు మెరుగైన వైద్య సదుపాయాలు చేరువకానున్నాయని మంత్రి తెలిపారు.

April 8, 2026 / 12:40 PM IST