• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కవిత

HYD: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షోభం నుంచి దేశాన్ని సక్సెస్ వైపు నడిపించిన మహోన్నతుడు, అణగారిన, పీడిత వర్గాలకు మార్గదర్శకుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.

April 5, 2026 / 01:36 PM IST

ప్రజల మాటే ప్రామాణ్యం.. రూ.4లక్షల గ్రానైట్ అందజేత

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో హనుమాన్ దేవాలయం నిర్మిస్తున్నారు. నిర్మాణానికి గ్రానైట్ అవసరం ఉండటంతో గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజల మాటకే ప్రామాణ్యంగా భావిస్తూ రూ.4 లక్షల విలువైన గ్రానైట్‌ను అందజేశారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న ఆయన సేవలను గ్రామస్తులు ప్రశంసించారు.

April 5, 2026 / 01:35 PM IST

100 ఎకరాల్లో మరో భారీ బస్ టెర్మినల్.!

హైదరాబాద్‌లో మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్‌రాష్ట్ర, సిటీ, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక టెర్మినల్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఎంజీబీఎస్, జేబీఎస్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గనున్నాయి.

April 5, 2026 / 01:35 PM IST

కేయూలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

HNK: కాకతీయ యూనివర్సిటీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభకు వీసీ ప్రతాపరెడ్డి, NIT ప్రొఫెసర్ డీ. కాశీనాథ్, తదితరులు హాజరయ్యారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని, కేయూ విద్యార్థులు విద్యలోనే కాకుండా సామాజిక బాధ్యతను కూడా సంపాదించుకోవాలని వారు అన్నారు.

April 5, 2026 / 01:34 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండల కేంద్రంలోని తుంగతుర్తి, కొప్పల్ గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందారన్నారు, తక్కువ తేమశాతం ఉండేవిధంగా చూసుకోవాలని కోరారు. వారి వెంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:32 PM IST

‘జన్నారం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి’

MNCL: జన్నారంను శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సాధన కం కమిటీ నాయకులు ప్రచారం ప్రారంభించారు ఆదివారం వారు జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న జన్నారం మండలం అభివృద్ధి చెందాలంటే నియోజకవర్గంగా మార్చడమే ముఖ్యమన్నారు.

April 5, 2026 / 01:30 PM IST

‘ప్రతి పేదవాడు లబ్ధి పొందుతున్నాడు’

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు లబ్ధి పొందుతున్నాడని కాంగ్రెస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ అన్నారు తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో రూ.1,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను చంద్రయ్య, లస్మవ్వ, నాగరాజు, లచ్చిరెడ్డి, శిరీషలకు కాంగ్రెస్ నాయకులు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగల్ ఉపయోగపడుతుందన్నారు.

April 5, 2026 / 01:30 PM IST

కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం

ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న ఇద్దరు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు దరఖాస్తులు కోరుతున్నట్లు కమిషనర్ గజానంద్ ఆదివారం తెలిపారు. అభ్యర్థులు స్థానిక ఓటరై ఉండి, ఐదేళ్ల రాజకీయ అనుభవం కలిగి ఉండాలన్నారు. రెండు పదవుల్లో ఒకటి మహిళకు కేటాయించామన్నారు. అర్హులైన వారు ఈ నెల 11న సాయంత్రం 5 గంటలలోపు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

April 5, 2026 / 01:30 PM IST

మంత్రి తుమ్మలను కలిసిన పద్మశాలీలు

WGL: తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వరంగల్ జిల్లాకు చెందిన పద్మశాలీలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. ఆదివారం ఉదయం వారు MLC బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

April 5, 2026 / 01:30 PM IST

చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

KNR: శంకరపట్నం మండలం చింతలపల్లిలో ఆదివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే గ్రామంలోని సీసీ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు రోడ్డుపై నడవడం ఇబ్బందికరంగా మారిందని వారు వాపోయారు. రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్థులు కోరుతున్నారు.

April 5, 2026 / 01:30 PM IST

జనక్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్

PDPL: ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, జిల్లా వాసి కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్ లభించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో కార్మిక రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర మంత్రి ఈ పట్టాను అందజేశారు. జీహెచ్ఐర్‌తో ఇండియా, వెబ్బిక్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:30 PM IST

రోడ్డు భద్రతపై అదిలాబాద్ ఎస్పీ ప్రత్యేక దృష్టి

ADB: అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ (IPS) నేతృత్వంలో ‘అరైవ్-అలైవ్’ (#ArriveAlive) కార్యక్రమంలో భాగంగా అదిలాబాద్-మహారాష్ట్ర జాతీయ రహదారిపై 40 సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రమాద మరణాలను 20% తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. వాహనదారులు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి మానుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.

April 5, 2026 / 01:30 PM IST

రైతులకు గమనిక.. రేపు మార్కెట్ OPEN

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

April 5, 2026 / 01:25 PM IST

హుస్నాబాద్‌లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

SDPT: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని హుస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చిత్ర పద్మ, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 01:22 PM IST

భారతావనికి విశేష సేవలు అందించిన మహనీయుడు

GDWL: భారతావనికి విశేష సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నడిగడ్డలో ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు లేకపోవడం వల్ల ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.

April 5, 2026 / 01:20 PM IST