• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించిన ఎమ్మెల్యే

JN: యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

April 5, 2026 / 07:17 PM IST

రంగనాథ్.. నీకు చెవులు వినిపిస్తలేవా..?

హైదరాబాద్ నగరంలోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేవలం పేదలను మాత్రమే అరెస్ట్ చేస్తారా..? బడాబాబులను ముట్టుకోవడానికి భయమా..? అని నిలదీశారు.

April 5, 2026 / 07:16 PM IST

ఎంపీ కడియం కావ్యకు వినతి

హన్మకొండ: జిల్లా పరిధిలోని సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంపీ కడియం కావ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంద కుమార్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థులు తాగునీరు, ఆహారం, పరిశుభ్రత, భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

April 5, 2026 / 07:15 PM IST

కేరళలో అధికారంలోకి రావడం ఖాయం

KMM: కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగానే ప్రజలకు ఇచ్చే ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మావేలిక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముతర రాజ్కు మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

April 5, 2026 / 07:12 PM IST

వేములవాడ ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవోగా అంజనారెడ్డి

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో రమాదేవి 13 రోజుల సెలవుపై వెళ్లిన నేపథ్యంలో, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో అంజనా రెడ్డి గారిని ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆలయానికి చేరుకున్న అనంతరం, అంజనా రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

April 5, 2026 / 07:12 PM IST

సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BHPL: ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రఖ్యాతిగాంచిన సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని, దేవాలయాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

April 5, 2026 / 07:12 PM IST

సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణం కాపాడారు

VKB: తాండూర్ మండలం కారణకోట్ గ్రామంలో చింతకింది శ్రీహరి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గ్రామానికి చేందిన పింజారి రషీద్‌కు ఆకస్మాతుగా గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయి పడిపోయారు. గమనించిన శ్రీహరి వెనంటేనే CPR చేసి రషీద్ శ్వాస తిరిగి వచ్చేలా చేశారు.

April 5, 2026 / 07:09 PM IST

తిమ్మక్క చెరువులో గుర్రపు డెక్క తొలగింపు

SRD: పటాన్‌చెరు తిమ్మక్క చెరువులో గుర్రపుడెక్కతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ నీలం మధు అండగా నిలిచారు. అధికారుల నిర్లక్ష్యంతో సమస్య కొనసాగుతుండగా, తన సొంత నిధులతో జేసీబీలతో శుభ్రపరిచే పనులు చేపట్టారు. చెరువు పునరుద్ధరణతో జీవనోపాధి మెరుగుపడుతుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ మధుకు కృతజ్ఞతలు తెలిపారు.

April 5, 2026 / 07:08 PM IST

ఓటరు జాబితా సవరణపై కలెక్టర్ దృష్టి

ASF: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఇవాళ కాగజ్‌నగర్‌లో కేంద్రీయ విద్యాలయం స్థాపన కోసం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించి, ఫారాలు 6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

April 5, 2026 / 07:08 PM IST

లింగోజిగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

BHNG: చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి బాబుజీ చేసిన సేవలు చిరస్మరణీయమని, సంఘ సంస్కర్తగా ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు కొనియాడారు.

April 5, 2026 / 07:04 PM IST

ఆ గ్రామంలో వరకట్నం నిషేధం

ADB: నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామంలో వరకట్నాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వధువు పెందోర్ రేణుక వివాహానికి రూ.25,500 ఆర్థిక సహాయం అందజేశారు. ఇక నుంచి గ్రామంలో పెళ్లి కట్నాలు తీసుకోబోమని నిర్ణయించారు. గ్రామ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ సహా గ్రామ పెద్దలు, యువత సభ్యులు పాల్గొన్నారు.

April 5, 2026 / 07:03 PM IST

అయ్యప్ప ఆలయంలో ఘనంగా మాసపూజ కార్యక్రమం

NZB: బాల్కొండలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం మాసపూజ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు. గణపతి, సుబ్రమణ్యస్వామి, శ్రీచక్రం, అయ్యప్పస్వామిలకు అభిషేకాలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ముప్కాల్ వాస్తవ్యులు తిమ్మాన్నగారి లాస్య శ్రీనివాస్ అన్నదాన సత్రానికి విరాళం అందించారు.

April 5, 2026 / 07:02 PM IST

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి: సురేంద్ర మోహన్

SRD: రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు. కొండాపూర్ మండలం తెరిపోల్ గ్రామంలో ఆదివారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి, మొక్కజొన్న, చెరుకు బదులుగా ఆయిల్ పామ్ సాగు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.

April 5, 2026 / 07:01 PM IST

ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా రవి ఎన్నిక

SDPT: చేర్యాలలో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ సంఘం సమావేశంలో చింతల రవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆయనను సన్మానించారు. రవి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజ్ సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.

April 5, 2026 / 07:01 PM IST

‘జగ్జీవన్ రామ్ కుటుంబం పాత్ర మరువలేనిది’

GDWL: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బాబు జగ్జీవన్ రామ్ కుటుంబ సభ్యుల పాత్ర కీలకమని ప్రజాసంఘాల నాయకులు జమ్మిచేడు కార్తీక్, దానయ్య, రాజు పేర్కొన్నారు. 119వ జయంతి సందర్భంగా గద్వాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ తెలంగాణ బిల్లు ఆమోదంలో ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 07:01 PM IST