SRD: పటాన్చెరు తిమ్మక్క చెరువులో గుర్రపుడెక్కతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ నీలం మధు అండగా నిలిచారు. అధికారుల నిర్లక్ష్యంతో సమస్య కొనసాగుతుండగా, తన సొంత నిధులతో జేసీబీలతో శుభ్రపరిచే పనులు చేపట్టారు. చెరువు పునరుద్ధరణతో జీవనోపాధి మెరుగుపడుతుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ మధుకు కృతజ్ఞతలు తెలిపారు.