• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

BHNG: భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలొ భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

April 9, 2026 / 04:05 PM IST

గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం: ఎమ్మెల్యే

NZB: జాతీయస్థాయిలో చేపట్టిన గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్క హిందువు మద్దతు ఎంతో అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అఖిల భారత గో సమ్మాన్ అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో గో సంరక్షణ కోసం ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.

April 9, 2026 / 04:01 PM IST

ఘనంగా ఎన్ఎస్‌యుఐ ఆవిర్భావ దినోత్సవం

WNP: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి యాదన్న మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా సంస్థల్లో అంటరానితనం, అసమతలను పెంచే పోషిస్తుందని వాటిని అడ్డకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 9, 2026 / 04:01 PM IST

‘బృందావని కాలువలోని చెత్తను వెంటనే తొలగించాలి’

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఇళ్ల మధ్యనే బృందావన్ కాల్వ చెత్త చేదారంతో దుర్వసనతో ప్రజలు అనారోగ్యం బారినా పడుతున్నారని వెంటనే చెత్తను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. పార్టీ పిలుపు మేరకు గురువారం రోజున సమస్యలపై పోరుయాత్ర నిర్వహించారు.

April 9, 2026 / 04:01 PM IST

రాంజిగొండ్ వర్ధంతి సభకు హాజరైన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలం రాంజిగొండ్ నగర్‌లో రాంజిగొండ్ వర్ధంతి సభను గ్రామస్తులు ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ముందుగా టెంకాయ కొట్టి రాంజిగొండ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులకై పోరాడిన వీరుడు రాంజిగోండ్ అని ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

April 9, 2026 / 03:50 PM IST

ఓపెన్ స్కూల్ పరీక్షలు.. హాల్ టికెట్లు వచ్చేశాయ్ !

MDK: తెలంగాణ ఓపెన్ స్కూల్ SSC, ఇంటర్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ లేదా 8096958096కు వాట్సాప్‌లో ‘Hi’ పంపి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు గమనించి హాల్ టికెట్లు పొందాలని అధికారులు సూచించారు.

April 9, 2026 / 03:49 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి: సీపీ

NZB: రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. కమ్మర్​పల్లి మండల కేంద్రంలో ఆర్మూర్​ డివిజన్​ పరిధిలోని సర్పంచ్​లతో గురువారం సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. అతివేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు.

April 9, 2026 / 03:48 PM IST

సెంట్రల్ జైలులో ఉచిత వైద్య శిబిరం

SRD: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో కందిలోని సెంట్రల్ జైల్లో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. వైద్యులు జైలులో ఉన్న ఖైదీలకు వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెండ్ సంతోష్ రాయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:43 PM IST

చెరువుల పరిరక్షణకు చర్యలు

WGL: GWMC పరిధి చెరువులు, కుంటలను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ‘లేక్ ప్రొటెక్షన్ కమిటీ’ రంగంలోకి దిగింది. గత నెల 13న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అధ్యక్షతన జరిగిన కమిటీ మొదటి సమావేశంలో నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగర పరిధిలోని మొత్తం 73 జల వనరులను తక్షణమే పరిరక్షించాలని కమిటీ నిర్ణయించింది.

April 9, 2026 / 03:42 PM IST

ఎర్రగడ్డ విషయంలో అధికారులు పోలీసుల మధ్య వాగ్వాదం

GDWL: గట్టు మండలం పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎర్రగట్టు ఒక వ్యక్తికి రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు రికార్డులు కనిపించగా, అది గ్రామానికి అవసరం, అభివృద్ధి కోసం ఆ గట్టు ఉండాలని గ్రామస్థులు అన్నారు. ఈ గట్టు ప్రైవేట్ వ్యక్తి చేతికి వెళ్లకూడదని గ్రామ సర్పంచ్ ఉప్పరి దేవేందర్ తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.

April 9, 2026 / 03:42 PM IST

స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం సందర్శించారు. నెలవారీ తనిఖీలలో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గదిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భద్రత సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా అధికారులు, భద్రత సిబ్బంది ఉన్నారు

April 9, 2026 / 03:40 PM IST

సీసీ కెమెరాపై ఉచిత శిక్షణ

SRD: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి RSETI ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ ఎం.రాజేష్ కుమార్ తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ కోర్సుకై దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు పూర్తిగా ఉచితం అని పేర్కొన్నారు.

April 9, 2026 / 03:40 PM IST

వైద్య ఖర్చుల కోసం ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే

MNCL: మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని షిర్కే కాలనీకి చెందిన సతీష్ కు రూ.3 లక్షలు, దండేపల్లి మండలంలోని మేదరిపేట గ్రామానికి చెందిన శంకర్ రావు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఎల్ఓసీని అందించారు.

April 9, 2026 / 03:38 PM IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

NLG: వెంగన్నగూడెంలో లబ్ధిదారురాలైన గూడపురి నాగమణి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ నాగమణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మేఘన, గ్రామ కార్యదర్శి నాగానాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 9, 2026 / 03:37 PM IST

వేసవి కాలం.. అధికారులు సూచనలు

MDK: వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించిన నీటి వృథాను నివారించాలని, తాగునీటిని పొదుపుగా ఉపయోగించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

April 9, 2026 / 03:30 PM IST