• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు’

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధన సరఫరా విషయంలో కూడా ఎక్కడా కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యథావిధిగా డెలివరీ జరుగుతుందని వదంతులు నమ్మవద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ శనివారం తెలియజేశారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బ్యాంకులు, 16 గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు.

April 5, 2026 / 07:53 AM IST

SIR ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

SRD: స్పెషల్ ఎంట్రెన్స్ ఓటరు రివిజన్ ప్రక్రియ (SIR)ను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించేలా చూడాలని చెప్పారు. అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద ఐటి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

April 5, 2026 / 07:49 AM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపిన భర్త

MBNR: మూసాపేట మండలం పోల్కంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న చందు, గొడవ కారణంగా తన భార్య శ్రీదేవిని (19) కొట్టి హత్య చేశాడు. నర్సుగా పనిచేస్తున్న శ్రీదేవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.వ రికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న చందును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 07:47 AM IST

మండలంలో జోరుగా అక్రమ మద్యం విక్రయాలు!

VKB: పెద్దేముల్ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు దృష్టి సారించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

April 5, 2026 / 07:41 AM IST

‘హెల్త్ సబ్ సెంటర్, ముదిరాజ్ సంఘ భవనం ప్రారంభం’

KMR: కోటగిరి మండలం కొత్తపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం, ముదిరాజ్ సంఘ భవనాన్ని శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ముదిరాజ్ సంఘ కమ్యూనిటీ భవనాలు, పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణాలకు నిధుల మంజూరులో ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముదిరాజ్ భవనంలో టాయిలెట్స్ కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు.

April 5, 2026 / 07:39 AM IST

వేంకటేశ్వర ఆలయానికి నిధులు మంజూరు

NZB: సిరికొండ మండలం చిమన్ పల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 10 లక్షల నిధులు మంజూరైనట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఆలయానికి నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే మంజూరు చేసినట్లు చెప్పారు. ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, ఉప సర్పంచ్ రాజేందర్, పాలుగోన్నారు.

April 5, 2026 / 07:38 AM IST

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: CI

ADB: వాణిజ్య అవసరాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని వన్ టౌన్ CI సునీల్ కుమార్ శనివారం తెలిపారు. నిబంధనలు అతిక్రమించి డొమెస్టిక్ గ్యాస్‌ను ఉపయోగిస్తున్న 6 వాణిజ్య సముదాయాలపై కేసులు నమోదు చేసి 8 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డొమెస్టిక్ గ్యాస్ దుర్వినియోగంపై పట్టణంలో ప్రత్యేకత తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 07:33 AM IST

జిల్లాలో భారీగా మాంసం ధరలు..!

KMR: కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ. 280-రూ. 290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ. 190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ. 800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

April 5, 2026 / 07:30 AM IST

ఓటరు జాబితా సవరణకు సహకరించండి: సీఈవో

GDWL: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. గద్వాల జిల్లాలో సవరణ ప్రక్రియ 74 శాతానికి చేరిందని వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

April 5, 2026 / 07:25 AM IST

మూడు నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

MDK: జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని కోరారు.

April 5, 2026 / 07:24 AM IST

‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి’

MNCL: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలని, BLOలు మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు.

April 5, 2026 / 07:23 AM IST

‘క్రీడాకారిణికి ఎమ్మెల్యే అభినందన’

PDPL: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు సుల్తాన్పూర్‌కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితను తన నివాసంలో అభినందించారు. కాగా చికిత ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంటు మిక్స్డ్ పోటీలలో గోల్డ్ మెడల్, ఉమెన్ విభాగంలో సిల్వర్ మెడల్ససాధించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

April 5, 2026 / 07:23 AM IST

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. కోస్గి వాసి మృతి

NRPT: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కోస్గిలో  విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం 13 ఏళ్లుగా కువైట్లో ఉంటున్న నారాయణపేట జిల్లా కోస్గి మండలం మల్‌రెడ్డిపల్లికి చెందిన సలీం పాషా (56) బాంబు పేలుడు ఘటనలో మృతి చెందారు. గత వారం ఆయన పని చేస్తున్న ప్రాంతంలో బాంబు పేలడంతో, దాని నుంచి వెలువడిన కెమికల్ ప్రభావంతో ఊపిరాడక చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

April 5, 2026 / 07:22 AM IST

వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్సై

MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన 8వ వార్డు సభ్యురాలు మునిగంటి సరిత- రాజు దంపతులు రూ.8500లతో కొనుగోలు చేసిన హెల్మెట్లను స్థానిక ఎస్సై కరుణాకర్ చేతుల మీదుగా ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా అందజేశారు. చాలా మందికి హెల్మెట్లు ఉన్నప్పటికీ ఇంట్లో పెడుతున్నారని, హెల్మెట్ ప్రాణాలకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు.

April 5, 2026 / 07:20 AM IST

‘నాంచారమ్మ జాతరలో సదుపాయాలు కల్పించాలి

MLG: వెంకటాపూర్ మండలం రామానుజపురంలో మే 1 నుంచి జరిగే నాంచారమ్మ జాతరకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం సమర్పించారు. జాతరకు రోడ్లు, విద్యుత్, తాగునీరు, శానిటేషన్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 07:20 AM IST