• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

GDWL: అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్‌లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఉప్పల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

March 29, 2026 / 04:03 PM IST

సాక్షరత పరీక్షలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

NGKL: వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాక్షరత పరీక్షల నిర్వహణ, కర్యక్రమం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ అధికారులు, సర్పంచ్ అనూష కృష్ణ, ఉపసర్పంచ్ ప్రసాద్ చారి తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 04:01 PM IST

‘మరణంలోనూ… ఇద్దరికీ కంటి చూపు’

PDPL: ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన దాసరి రామచందర్ (70) మరణంలోనూ ఇద్దరికీ కంటిచూపు ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే… రామచందర్ శనివారం మరణించగా కుమారులు, కుమార్తెలు ఆయన నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. పుట్టెడు దుఃఖంలోను నేత్రదానం చేసి, ఇద్దరికి చూపు ప్రసాదించిన వీరిని పలువురు అభినందించారు.

March 29, 2026 / 04:00 PM IST

ఇవాళ రాత్రి వర్షం కురిసే ఛాన్స్..!

HYD: హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని, సాయంత్రం సమయాలలో ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

March 29, 2026 / 04:00 PM IST

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మంచిది కాదు: మంత్రి

WGL: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మనకు, మన పిల్లలకు మంచిది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. అసెంబ్లీలో నేడు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సమాజం మారాల్సిన అవసరం ఉందని, విలువలు, ప్రేమాభిమానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతలను పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.

March 29, 2026 / 03:47 PM IST

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అడూర్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ విచ్చేస్తున్న నేపథ్యంలో,ఆదివారం జుక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐసీసీ పరిశీలకుడిగా ఉన్న ఆయన, పార్టీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.

March 29, 2026 / 03:44 PM IST

అమ్మకు అక్షరాస్యత పరీక్ష నిర్వహణ

SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ అంగన్వాడి భవనంలో అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ఉల్లాస్ పథకం ద్వారా అమ్మకు అక్షర పరీక్షను IKP CC సుజాత, దుర్గయ్య పర్యవేక్షణలో జరిగింది. 30 మంది మహిళలు పరీక్ష రాశారు. సర్పంచ్ వార్ల రమ్య, APM సరిత పరిశీలించారు. VOA తుకారం ఉన్నారు.

March 29, 2026 / 03:43 PM IST

ఈ నెల 31న తైబజార్ వేలం

NRPT: నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని తైబజార్ హక్కుల వేలాన్ని ఈనెల 31న మంగళవారం ఉదయం 10:00 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు తప్పనిసరిగా రూ.5,000/- టోకెన్ అమౌంట్‌‌ను ముందుగా చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

March 29, 2026 / 03:41 PM IST

ఈతకు వెళ్లిన బాలురు.. క్వారీలో గల్లంతు

KMM: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు క్వారీ గుంతలో గల్లంతైన ఘటన సత్తుపల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివ(13), నాగబాబు (14) ఇవాళ మధ్యాహ్నం మెట్టాంజనేయస్వామి ఆలయం వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగారు.

March 29, 2026 / 03:40 PM IST

రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

NLG: మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామానికి చెందిన ఉగ్గిడి శివకుమార్ యాదవ్‌కు ప్రమాదం జరిగి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజానాయకుడు పాండురంగారెడ్డి నిమ్స్ ఆసుపత్రికి ఆదివారం వెళ్లి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిడి మణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:39 PM IST

కార్మిక సమస్యలపై జరిగిన మీటింగ్‌లో మాజీ మంత్రి

MDCL: బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఉషా కంపెనీ కార్మికులతో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, హక్కులు, యూనియన్ బలోపేతంపై కార్మికులతో చర్చించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

March 29, 2026 / 03:38 PM IST

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మెన్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 7వ వార్డ్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్ ఛైర్మెన్ దావ స్వాతి-రమేష్ బాబు ఆదివారం పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.

March 29, 2026 / 03:36 PM IST

కొత్తూరులో CMRF చెక్కులు పంపిణీ

MHBD: సీరోల్ మండలం కొత్తూరు గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ పగడాల కృష్ణారెడ్డి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.

March 29, 2026 / 03:33 PM IST

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి: ప్రశాంత్ రెడ్డి

JN: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి అన్నారు. జనగామలో మున్సిపల్ కౌన్సిలర్లతో వారు సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని వారు కౌన్సిలర్లకు సూచించారు.

March 29, 2026 / 03:31 PM IST

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణం 6వ వార్డులో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వాణి, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, కౌన్సిలర్ లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకుల ప్రజలు పాల్గొన్నారు.

March 29, 2026 / 03:30 PM IST