SRD: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి RSETI ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ ఎం.రాజేష్ కుమార్ తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ కోర్సుకై దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు పూర్తిగా ఉచితం అని పేర్కొన్నారు.