MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం మిడ్జిల్ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం 1 గంటలకు చిల్వేర్ గ్రామంలో రాజారెడ్డి సతీమణి జ్ఞాపకార్థం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.