HNK: కాజీపేట నుంచి పొత్కపల్లి వరకు హైస్పీడ్ కారిడార్లో కవచ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. రెండు లోకోలతో హెడ్-ఆన్, సైడ్ కొలిజన్ నివారణ, బ్రేక్ వ్యవస్థలను పరీక్షించారు. ప్రమాదాల నివారణలో ఈ సాంకేతికత కీలకంగా ఉపయోగపడుతుందున్నారు. జమ్మికుంట-రామగుండం మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను చూశారు.