NLG: చిట్యాల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్‌ను బీజేపీ నేత చికిలంమెట్ల అశోక్ కలిసి స్థానిక సమస్యలను విన్నవించారు. 241 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. సాదాబైనామా, భూ సమస్యలు పరిష్కరించాలని, అమృత్ 2.0 కింద నీటి ట్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.