• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పిఎన్జతో వంట గ్యాస్ సరఫరాకు కసరత్తు

NRPT: భవిష్యత్తులో ఎల్పీజీ గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో PNG( పైపుడ్ నాచురల్ గ్యాస్) తో కమర్షియల్ అవసరాలకు వంట గ్యాస్ సరఫరాకు కసరత్తు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జిల్లా కమిటీ సభ్యులతో పీఎన్జీ గురించి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ మాట్లాడారు.

April 9, 2026 / 07:33 AM IST

ఎమ్మెల్యే బాలునాయక్ నేటి పర్యటన షెడ్యూల్

NLG: ఎమ్మెల్యే బాలునాయక్ ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చింతపల్లి వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం కొండమల్లేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మౌలిక వసతుల సమస్యలపై ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.

April 9, 2026 / 07:24 AM IST

ఆధ్వానంగా మారిన లక్ష్మీపూర్ రోడ్డు

NRML: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. రోడ్డంతా గుంతలు పడటంతో రాత్రి సమయాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణించాలంటేనే భయం వేస్తోందని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

April 9, 2026 / 07:22 AM IST

వరంగల్‌లో ప్రమాదం కారును ఢీకొట్టిన లారీ

WGL: ఖిలా వరంగల్ పరిధిలో జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొట్టడంతో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రహదారి ఇరుకుగా ఉండడం, డివైడర్ ఏర్పాటు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

April 9, 2026 / 07:21 AM IST

టీజీఆర్‌జేసీ సెట్‌కు విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

NZB: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్‌జేసీ సెట్‌కు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశానికి ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, మే 5న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

April 9, 2026 / 07:21 AM IST

ఇంటి పన్నుపై 5% రిబేట్: మున్సిపల్ కమిషనర్

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రజలు ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించి 5% రిబేట్ పొందాలని కమిషనర్ అయాజ్ సూచించారు. బుధవారం వార్డుల్లో పర్యటించి పన్ను వసూళ్లను పరిశీలించిన ఆయన, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

April 9, 2026 / 07:20 AM IST

ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

వరంగల్‌ జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద బుధవారం అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి ఎండల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

April 9, 2026 / 07:16 AM IST

నేడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

SRPT: మునగాల మండలంలోని విజయరాఘవపురం,మునగాల, ముకుందాపురం గ్రామాల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఏపీఎం కరుణాకర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 9, 2026 / 07:12 AM IST

గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి: మంజుల

ADB: గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ప్రసవానంతర సంరక్షణ, జాగ్రత్తలు తీసుకోవాలని ICDS సూపర్వైజర్ మంజుల సూచించారు. నేరడిగొండలోని అంగన్వాడీ సెంటర్ను PHC వైద్యులతో కలిసి సందర్శించి ‘సేఫ్ మదర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలకు ఆరోగ్యం సంరక్షణ, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తల్లుల ఆరోగ్యం గ్రామ అభివృద్ధికి కీలకమన్నారు.

April 9, 2026 / 07:08 AM IST

“సేవలను గుర్తిస్తాం – అవార్డులను అందిస్తాం”

SRD: ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకకునెట్టి వేసిన దళిత కుటుంబాలను ఆదుకోవడానికి ఎవరు ముందుకు వచ్చిన వారిని గౌరవంగా సత్కరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఎంతోకాలంగా దళితులకు సేవలు అందిస్తున్న జయ శ్రీనివాసుకు “దళిత రత్న అవార్డు” ప్రధానం సందర్భంగా మాట్లాడారు. రుద్రారం శంకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులను గౌరవిస్తుంది అన్నారు.

April 9, 2026 / 07:08 AM IST

‘ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకం ఒక వరం’

SDPT: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం యువత ఉపాధికి గొప్ప వేదికని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులని, శిక్షణ కాలంలో వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

April 9, 2026 / 07:08 AM IST

కొనసాగుతున్న జాతర ఉత్సవాలు

JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలు కొనసాగుతున్నయి ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వంటి పలు ప్రత్యేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్, అర్చకులు మాధవాచార్యులు, దివాకర చార్యులు, తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 07:05 AM IST

నేడు జన్నారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

MNCL: జన్నారం మండలంలో గురువారం ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పర్యటించనున్నారు. ఉ.10 గం.లకు మండల కేంద్రంలోని MPDO ఆఫీస్ లో దస్తురాబాద్, జన్నారం మండలాల సర్పంచుల సమావేశానికి, ఉ.11 గం.లకు మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద NSUI ఫౌండేషన్ డే కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో NSUI, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమవుతారు.

April 9, 2026 / 07:03 AM IST

‘మాతృ మరణాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి’

MBNR: జిల్లాలో మాతృ మరణాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృ మరణాలకు సంబంధించి కలెక్టర్‌కు డిఎం అండ్ హెచ్ ఓ వివరించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.

April 9, 2026 / 07:00 AM IST

నేడు బాలికలకు ఉచితంగా ‘హెచ్పీవీ’ టీకా

SRPT: మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నేడు 14–15 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా వేయనున్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఈ టీకా రక్షణ కల్పిస్తుందని వైద్యాధికారులు తెలిపారు. అర్హులైన బాలికలు ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు టీకా వేయించాలని కోరారు.

April 9, 2026 / 06:55 AM IST