• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ముప్పారంలో ప్రారంభమైన ఐకేపీ కేంద్రం

NLG: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మార్కెట్ ఛైర్మన్ అంకతీ సత్యం సూచించారు. నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ కేంద్రం ఊరటనిస్తుందని, వడ్ల సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

April 10, 2026 / 03:50 PM IST

ఈ నెల 12న మెట్టుగుట్టలో సామూహిక రుద్రాభిషేకం

HNK: మెట్టు రామలింగేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత సామూహిక మహాన్యాస రుద్రాభిషేక పూజలు ఈ నెల 12న ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు పెద్ది ప్రభాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు రుద్రాభిషేకం ప్రారంభమవుతుందని, కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

April 10, 2026 / 03:49 PM IST

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడికి సన్మానం..!

GDWL: రాజోలి మండల కేంద్రానికి చెందిన ఎల్లారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ గ్రామంలో ఆయన్ని ఘనంగా శాలువాతో సన్మానించారు. గ్రామం నుంచి డీసీసీ ఉపాధ్యక్షుడు ఉండడం గ్రామానికే గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో రాజోలి సర్పంచ్ గంగిరెడ్డి, మండల అధ్యక్షుడు దస్తగిరి, తదితరులు ఉన్నారు.

April 10, 2026 / 03:48 PM IST

రోడ్డు సమస్యల పరిష్కారానికి కృషి: తుంగతుర్తి రవి

MDCL: మేడిపల్లి 9వ డివిజన్‌లోని SFS స్కూల్ నుంచి పర్వతపూర్ CPRI రోడ్డులో సాయి ఐశ్వర్య కాలనీ వరకు రహదారి దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన తుంగతుర్తి రవి మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ, వర్షపు నీరు నిల్వవడం వల్ల గుంతలు పడుతున్నాయని తెలిపారు. రోడ్డును ఎత్తు పెంచి, కొత్త మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేశారు.

April 10, 2026 / 03:48 PM IST

మార్కెట్‌కు 2 రోజులు సెలవు

KNR: జమ్మికుంట మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 6 వాహనాల్లో 69 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ. 7,900, కనిష్ఠంగా రూ.6,400ల ధర పలికింది.

April 10, 2026 / 03:46 PM IST

మునగాలలో ముగిసిన వృత్తి నైపుణ్య శిక్షణ

SRPT: మునగాల మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలకు చెందిన 30 మంది ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ శిక్షణ శుక్రవారం ముగిసింది. శిక్షణలో భాగంగా మీడియా & ఎంటర్టైన్‌మెంట్, హెల్త్ కేర్ కోర్సులలో 10 రోజులపాటు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందించినట్లు శిక్షణ నిర్వాహకులు కే. లక్ష్మి, విజయ దుర్గ తెలిపారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.

April 10, 2026 / 03:44 PM IST

ఇందిరమ్మ ఇళ్లకు పెరుగుతున్న సమస్యలు

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జన్నారం మండలంలో ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. చెన్నూర్, కాళేశ్వరం నుంచి ఇసుకను తెప్పించుకోవాలంటే లబ్ధిదారులకు వ్యయ, భారం పడుతుంది.

April 10, 2026 / 03:40 PM IST

ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెండ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నా సతీష్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో విధుల పట్ల ఆలసత్వం చూపినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ స్పష్టం చేశారు.

April 10, 2026 / 03:40 PM IST

సమస్యలను అడిగి తెలుసుకున్న DBF నేతలు

HNK: దామెర మండలంలోని లాదెళ్లలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజల సమస్యలను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నేతలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేసే వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు.

April 10, 2026 / 03:37 PM IST

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

WGL: దుగ్గొండి మండలలోని ముద్దునూరు గ్రామ పరిసరాల్లో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, తయారీ స్థావరాన్ని, పాత్రలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ఘటనలో జక్కుల స్వామి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.

April 10, 2026 / 03:36 PM IST

తిప్పలగుల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MDK: నిజాంపేట పరిధిలోని తిప్పనగుల్లలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం విక్రయించే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైతులకు సూచించారు.

April 10, 2026 / 03:36 PM IST

గేదెల పథకానికి ఇంకా దరఖాస్తు చేయలేదా?

NLG: జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశం కల్పించింది. రివైజ్‌డ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద అమలు చేస్తున్న రెండు పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 10, 2026 / 03:34 PM IST

వేల్పూర్ పంచాయతీ సంచలన తీర్మానాలు!

NZB: గ్రామ యువత, పిల్లల ఆరోగ్యం కోసం వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్ ఆధ్వర్యంలో 3 కీలక తీర్మానాలు చేశారు. గంజాయి అమ్మిన వారి సమాచారం ఇస్తే రూ.10,000 బహుమతి, 21 ఏళ్ల లోపు వారికి మత్తు పదార్థాలు అమ్మితే షాపులకు రూ.10,000 జరిమానా విధిస్తారు. అలాగే గ్రామంలో ఐస్ క్రీమ్ బండ్లు పూర్తిగా నిషేధం, పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధిస్తారు.

April 10, 2026 / 03:32 PM IST

మీ సేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో నూతన మీ సేవ కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి సబ్ కలెక్టర్ కిరణ్మయి దరఖాస్తులు కోరారు. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, 21-44 ఏళ్ల మధ్య వయస్సు గల మండల స్థానిక అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు ఈ నెల 13 నుంచి 18 వరకు బాన్సువాడ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు

April 10, 2026 / 03:32 PM IST

మజీద్‌పూర్‌లో నూతన ఇందిరమ్మ ఇల్లు షురూ

MDCL: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి మజీద్‌పూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇళ్ల కల నెరవేర్చుకుంటున్నాయని తెలిపారు.

April 10, 2026 / 03:31 PM IST