VKB: జీవితంలో ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని జడ్పీ సీఈవో సుధీర్ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ హోమియోపతి డేను ఆయుష్ వారి ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
HYD: సిటీ సివిల్ కోర్టు అడిషనల్ చీఫ్ సివిల్ జడ్జి-3 B.శ్రీనివాసరావు ఖమ్మం అండ్ సెషన్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. HYD మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి డాక్టర్ మహేష్ నాథ్, ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు కమ్, అడిషనల్ కోర్టుకు జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్బీనగర్ RR జిల్లా XII డిస్టిక్ అండ్ అడిషనల్ సెషన్స్ జడ్జిగా అనిత రానున్నారు.
RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ 2, 8, 18 వార్డులలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందే మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ ప్రజలకు గర్భాశయ క్యాన్సర్‌పై వివరించారు. ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
VKB: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలోని ఇందిరానగర్, దేవినగర్, బండప్ప బావి, మరికాంబ కాలనీ బస్తీలు కలిసి ఏప్రిల్ 19న హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమ్మేళన సభ్యులు తెలిపారు. ఈ మేరకు కరపత్రాన్ని విడుదల చేశారు. హిందూ సోదరులు కార్యక్రమానికి భారీగా హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
KMM: కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
HYD: తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు, ఓ అమ్మాయికి HIV రక్తం ఎక్కించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మనోవేదనను తట్టుకోలేని అమ్మాయి నేడు ఆత్మహత్యకు పాల్పడింది. HYD శివారు పోచారం కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
MDK: ప్రజా పాలన – ప్రగతి ప్రాణాలికలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి రాందాస్ చౌరస్తా వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఆరోగ్య వారోత్సవాల్లో 4వ రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ మరియు క్షయ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ బల్దియాలో డిప్యూటీ మేయర్‌కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించడంపై పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 20 (3)లో ప్రత్యేక గది కేటాయింపుపై ఎలాంటి నిబంధనలు లేకున్నా, తానే గది కేటాయించుకోవడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తున్నారు.
SRCL: వ్యాధులను నయం చేయడంలో ఆయుర్వేదిక్ మందులు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవ సందర్భంగా సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ.. ఆయుర్వేదిక్ మందుల వలన ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా వ్యాధులు నయమవుతాయన్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణించేవారు నీటి కోసం కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో కండక్టర్ షేక్ నజీర్ తన బస్సులో ప్రత్యేకంగా వాటర్ క్యాన్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లని నీటిని అందించారు. ఆయన చొరవను డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డి అభినందించారు.
MDK: చేగుంట పోలీసులు ముదిరాజ్ సంఘ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ముదిరాజ్ లను బీసీ -డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలంటూ ముదిరాజ్ సంఘం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చేగుంట పోలీసులు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి లింగం ముదిరాజ్, చింతల సిద్ధిరాములు ముదిరాజ్ ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
GDWL: అమెరికా–భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వల్ల పత్తి రైతులకు నష్టం జరుగుతోందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు జి. గోపాల్, కార్తిక్ అన్నారు. ఈ ఒప్పందంతో పత్తి ధర మద్దతు ధర కంటే తగ్గిందని, పాలు, మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఏప్రిల్ 13న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
NZB: నేటి నుంచి టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఇందల్వాయి (44వ జాతీయ రహదారి), బిక్కనూర్ వద్ద టోల్ చెల్లింపులు కేవలం ఫాస్టాగ్ లేదా UPI ద్వారానే జరుగుతాయన్నారు. ఫాస్టాగ్ లేని పక్షంలో వాహనదారులు 1.25 రెట్లు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
WNP: పానగల్ మండలం కొత్తకోట ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ రాధా కిరణ్ సాగర్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు శుక్రవారం సూచించారు. అనంతరం కిచెన్ షెడ్డు, మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ప్రధానోపాధ్యాయుడు కురుమూర్తి పాల్గొన్నారు.
KMR: లింగంపేట్ మండలం భవానీపేట (తండా)లో నిర్మిస్తున్న జగదాంబ, సేవాలాల్ ఆలయ నిర్మాణానికి భవానీపేట గ్రామ సర్పంచ్ ఆకుల సురేందర్ రూ. 50,000 భారీ విరాళాన్ని తండా వాసులకు అందజేశారు. ఈ మేరకు తండా ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అక్కుల సాయిలు, చందర్ నాయక్, రూప్ సింగ్, ధన్ రాజ్, సరిచంద్, వార్డు మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.