SRCL: కెనాల్ నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని కోరుతూ రైతులు రోడ్డపై నిరసన చేపట్టారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ సమీపంలో ఎల్ఎమ్ 6కెనాల్ నిర్మాణం చేపట్టాలంటూ రైతులు చేపట్టిన నిరసనదీక్ష శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టడంతో పాటు వంటావార్పు చేపట్టారు.
VKB: పరిగికు చెందిన ఫిట్‌నెస్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాలు సాధించారు. సాయి రామ్ (U45), ఆకాశ్ (U59), రజిత తమ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. కోచ్ ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో రాణించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.
KMR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి MLA KVR సవాల్ విసిరారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వద్దకు వెళ్దామని, తాను తప్పు చేసినట్లు రుజువైతే షబ్బీర్ అలీ కాళ్లు మొక్కి, శాశ్వతంగా రాజకీయం సన్యాసం తీసుకుంటానని అన్నారు. తాను మాట మీద ఉంటానని తెలిపారు. కాంగ్రెసోళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆట మొదలు పెట్టారని, రేపటి నుంచి అసలు ఆట తాను చూపిస్తానని హెచ్చరించారు.
JGL: పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన దావు హార్తిక్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 12 ఏళ్ల బాలుర కాటాస్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాడు.
MDK: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు వార్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్‌కు సంబంధించి నేతలకు, కార్యకర్తలకు తగు సూచనలను చేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన నర్సాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ భూచేష్ యాదవ్, కౌన్సిలర్లు శంకర్ గౌడ్, శ్రీకాంత్ నిరంజన్ దాస్‌ను సన్మానించారు.
NLG: నిరుద్యోగ యువతీ, యువకుల కోసం వివిధ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని పద్మ తెలిపారు. ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్-డిగ్రీ వారు అర్హులని వెల్లడించారు.
MNCL: భీమారం మండలం నర్సింగాపూర్‌లో దొంగతనం జరిగింది. SI రాజేందర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి సత్తయ్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వివాహానికి వెళ్లాడు. తిరిగి రాత్రి వచ్చి చూసేసరికి ఇంటి తాళం, బీరువా పగులగొట్టి ఉన్నాయి. సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిబంధనల ప్రకారం 2025-26 సీజన్‌కు సంబంధించి మద్దతు ధర (MSP) వద్ద పత్తి కొనుగోలు ప్రక్రియ ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులు ఈ కొద్ది రోజులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ASF: కాగజ్ నగర్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా కాల్చడంతో అందులోంచి వచ్చిన మినుగురులు వరుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన టెంటుపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని టెంటు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
SDPT: కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గడ్డం కృష్ణయ్య, ఎంపీవో రవీందర్ రెడ్డి మండలంలోని వార్డు సభ్యులకు శిక్షణ సదస్సు నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అధికారులు బాలాజీ, కుమార్, మాధవి అందించగా.. శిక్షణ పూర్తి చేసిన వార్డ్ సభ్యులకు గ్రామ కార్యదర్శి మాధురి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డైరెక్టర్ జగన్మోహన్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు.
NRML: గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లా కార్మికుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుకలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. విదేశాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు 93984 21883 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.
NLG: జిల్లా ప్రజలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు పనులు అవాంతరాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి నేటికీ ఏడాది అయ్యింది. ఈ ప్రాజెక్టు 20 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. 43 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇంకా 9 కి.మీ పనులు జరగాల్సి ఉంది.
JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు శనివారం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘అ’ ఆకారంలో కూర్చొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరు మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి నేర్చుకోవాలని, మాతృభాష అమ్మ లాంటిదని విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వేముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
SRPT: మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామంలో భారీగా నకిలీ పురుగుమందు విక్రయం బట్టబయలైంది. ప్రముఖ కంపెనీ ‘Bayer Nativo’ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నారన్న సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు డీలర్ షాపులు, గౌడౌన్‌లపై శనివారం సాయంత్రం మెరుపు దాడులు చేశారు. రూ.3 లక్షల విలువైన నకిలీ ప్యాకెట్లు, పౌడర్‌తో పాటు రూ.8 లక్షల విలువైన పెస్టిసైడ్స్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.