వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడను మరో యాదాద్రి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో అలాగే అధికారులతో సమీక్షించారు.
వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడను మరో యాదాద్రి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో అలాగే అధికారులతో సమీక్షించారు. శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని తెలిపిన కేటీఆర్ ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేములవాడ జాతరకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అదనపు నిధుల కేటాయిస్తామని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాల పైన అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. వేములవాడ గుడి చెరువు బండ్ ను వరంగల్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకు మారుపేరుగా నిల్వనున్నాయన్న కేటీఆర్ ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్ అలాగే వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.