KDP: సిద్ధవటంలోని స్థానిక జడ్పీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని భావన జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు HM సునీత తెలిపారు. ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 10న కడపలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపినట్లు వివరించారు. ఏప్రిల్ లో గుజరాత్ లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.