AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 75,428 మంది దర్శించుకోగా 36,240 మంది భక్తులు తలనీలాలర్పించారు. హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు వచ్చింది.