ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాంబులు పెట్టి.. ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా…. దీనిలో భాగంగా ఆయన ప్రస్తుతం ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ వ్యాఖ్యానించారు. నక్సలైట్లు ప్రగతిభవన్ ను గ్రెనేడ్లతోపెల్చేసినా ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. పేదలకు కేసీఆర్ ఇళ్లు ఇవ్వలేదు గానీ.. హైదరాబాద్ నడిబొడ్డున పది ఏకరాలల్లో 2000 కోట్లతో 150 గదుల ప్రగతి భవన్ నిర్మించుకున్నారని విమర్శించారు.
పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ఎందుకన్నారు. ఆనాడు గడీలను గ్రానేట్‌లతో పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్‌ను పేల్చేయాలంటూ బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లాలో పాదయాత్ర ముగిసిన అనంతరం రేవంత్ తన పాదయాత్రను మహబూబాబాద్ లో యాత్ర కొనసాగించనున్నారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రాణహాని తలపెట్టేలా నక్సలైట్లకు పిలుపునిచ్చారని రేవంత్‌రెడ్డిపై ములుగు, నర్సంపేటల్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేయడం గమనార్హం.