హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై నలుగురు యువకులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ బాలికకు మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారట. మందుల కోసం మెడికల్ షాపునకు ఆ బాలిక వెళ్లింది. అయితే ఓ మహిళ కనిపించి ఎక్కడికి అని అడిగింది. మందుల కోసం అని చెప్పగా తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పడంతో ఆశ పడి వెళ్లింది. సదరు మహిళ ఆ యువకులకు అప్పగించింది. అప్పటికే వారు గంజాయి మత్తులో ఉన్నారు. గదిలో బంధించి లైంగికదాడి చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక ఆ విషయం పేరంట్స్కు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కొందరు మృగాళ్లు మారడం లేదు. మద్యం మత్తులో లైంగికదాడులకు తెగబడుతున్నారు. చిన్న, పెద్ద అని కూడా చూడటం లేదు. రోజుకో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫోక్సో లాంటి కఠిన చట్టాలు ఉన్నా.. డ్రగ్స్ మత్తులో దారుణానికి పాల్పడుతూనే ఉన్నారు.