MNCL: కన్నేపల్లి మండలం మెట్ పల్లి గ్రామంలో గురువారం దారుణం హత్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ముడిమడుగుల తిరుపతి అనే వ్యక్తి తన భార్య ముడిమడుగుల తులసిని (30) గొడ్డలితో నరికి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు SI గంగారాం ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు.