Sandeep Lamichhane: నేపాల్‌కు చెందిన ఫేమస్ క్రికెటర్ సందీప్ లామిచానే ఓ అత్యాచార కేసులో దోషిగా తేలాడు. మైనర్ బాలికను రేప్ చేసినట్లు గతంలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఓ హోటల్లో సందీప్ అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని విచారణకు హాజరుకావాలని ఆదేశంచారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు సందీప్‌ను దోషిగా తీర్పునిచ్చింది.
ఈ కేసులో సందీప్‌కి దాదాపు 10ఏళ్లు శిక్ష పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏన్నేళ్లు శిక్ష పడుతుందో తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం లామిచేనేని బెయిల్‌పై బయట ఉన్నాడు. ఇతను 2018లో ఢిల్లీ క్యాపిట్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ ఆడిన తొలి నేపాల్ ఆటగాడు సందీప్‌నే. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 టోర్నీల్లో కూడా ఆడాడు. 23 ఏళ్ల సందీప్ నేపాల్‌లో మేటి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రేప్ కేసు నమోదు కావడంతో అతన్ని గతేడాది నేపాల్ కెప్టెన్సీ నుంచి తప్పించారు.