BDK: దమ్మపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ… వర్షాకాలం సమీపిస్తు ఉండడంతో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి బిల్లులు మూడు దఫాలుగా వస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.