ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
సమాజాన్ని కాపాడాల్సిన రక్షకభటులే(constable) హద్దు మీరితే ఎలా? అవును ఇటివల కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరొకటి బయటకు వచ్చింది. అది కూడా ఓ మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేస్తున్న ఘటన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం(ananthapuram)లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే రమేష్, అతని భార్య ఇద్దరు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఒక పాప ఉంది. అయితే ఆ పాపను ఆడించేందుకు సహా పలు రకాల పనుల కోసం ఓ బాలికను వారి ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అంతే ఆ క్రమంలో ఆ బాలికపై రమేష్ కన్నేశాడు. నెమ్మదిగా మాయమాటలు చెప్పి ఆ బాలికను లొంగదీసుకున్నాడు.
అంతటితో ఆగలేదు. అలా ఆరు నెలలుగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారం చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి పేరెంట్స్ నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యుల మద్దతుతో బాధితురాలు డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్(ramesh)ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే కానిస్టేబుల్ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాలిక(minor girl)ను బెదిరించాడని బాధితురులు వాపోయింది. ఈ నిర్వాకం గురించి తెలిసిన స్థానికులు కానిస్టేబుల్ ఓ బాధ్యత గల పదవిలో ఉంటూ ఇలా చేయడమెంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనల పట్ల పోలీసులు(police) అప్రమత్తంగా ఉండాలని మరికొంత మంది సూచిస్తున్నారు.