»Ponguleti Srinivas Meeting With Ap Cm Jagan Mohan Reddy What Happened In Ap Politics
AP CM: జగన్‌తో పొంగులేటి భేటీ..ఏంటి సంగతి?
తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఇంకా 9 నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున నెమ్మదిగా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కొత్త పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy) గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM Jagan mohan reddy)ని కలిశారు.
ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas) తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రస్తుతం పలువురు రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు కలిశారు. ఏ చర్చించారనే దానిపై కొంత మంది నేతలు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. అయితే వైఎస్ షర్మిలతో పొంగులేటి, సీఎం జగన్(CM Jagan) చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని పొంగులేటి సీఎం జగన్‌కు తెలియజేశారని సమాచారం. షర్మిలను కాంగ్రెస్‌లో చేరేలా చేయడంలో, కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌తో పాటు ఆమె వైఎస్సార్టీపీని విలీనం చేయడంలో పొంగులేటి పెద్ద పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8న షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని, షర్మిల, వైఎస్ఆర్టీపీ(YSRCP), కాంగ్రెస్(congress) వర్గాలు దీనిపై ఇప్పటికే పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని కాంగ్రెస్ సన్నిహితులు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఆ పార్టీకి కచ్చితంగా మేలు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాని వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయంటున్నారు. కానీ ఫలితాన్ని అంత ఈజీగా అంచనా వేయలేమని మరికొంత మంది నేతలు చెబుతున్నారు.