Shivaji: ఏపీ పాలిటిక్స్ గురించి సుధీర్ఘంగా హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజకీయాలు ఎప్పుడూ మన చుట్టునే ఉంటాయి అయితే ఎలక్షన్ అయిపోయాయి, ఓటమి, గెలుపులు తేలిపోయాయి. ఓడిపోయిన వాళ్లు విశ్లేషణ చేసుకోవాలి కానీ అనవసరమైన మాటలు మాట్లాడొద్దు అని అన్నారు. చాలా మంది ఎన్ఆర్ఐలు టీడీపీ గురించి, చంద్రబాబు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకోసం యూకే వెళ్లాలనే ప్రణాళిక చేస్తున్నట్లు శివాజీ పేర్కొన్నారు. ఏపీలో చాలా మందికి కులపిచ్చి ఉందని అది కరెక్ట్ కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎప్పుడో కానీ పుట్టరు, అలాంటి వ్యక్తి ఏపీకి ఎంతో అవసరం అని అన్నారు. నిజానికి వైఎస్ జగన్కు ఏమి తెలియదని, వైఎస్ షర్మిలకు ఉన్నంత తెలిపి కూడా లేదని శివాజీ వెల్లడించారు. షర్మిలకు చాలా తెగింపు ఉందని, పేపర్ లేకుండా అనర్గళంగా మాట్లాడగలది చెప్పుకొచ్చారు. ఇక జర్నలిజమ్ గురించి పలు విమర్శలు చేశారు. రాష్ట్రం మీద విషయం చిమ్ముతున్న ఒక జర్నలిస్ట్ గురించి ప్రస్తావించారు. కర్మ తిరిగి మనవైపే వస్తుంది గుర్తిపెట్టుకో అని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి ఎన్నో సంచలనమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. వాటి కోసం ఈ వీడియో పూర్తిగా చూసేయండి.