»Chandrababu Extortion Is Something Development Is Something And Vote For It
Chandrababu: దోపిడీ ఏదో.. అభివృద్ధి ఏదో గుర్తించి ఓటేయాలి
టీడీపీ, జనసేన స్వార్థం కోసం కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది అభివృద్ధో? ఏది దోపిడినో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పెనుకొండ సభలో తెలిపారు.
Chandrababu: టీడీపీ, జనసేన స్వార్థం కోసం కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది అభివృద్ధో? ఏది దోపిడినో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పెనుకొండ సభలో తెలిపారు. రైతులకు సాగునీరు ఇస్తే చాలు. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. అనంతపురం జిల్లా అంటే ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడే. కరవు జిల్లాను సస్యశ్యామలం చేయాలని టీడీపీ అధికారంలో చెప్పాం. కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించాం.
గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేశాం. కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి. దీనివల్ల 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి. 2014లో ఈ ప్రాంతం ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. మేం అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి. స్కీమ్‌ల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు.