BRS will do another campaign for Krishna Board in Telangana. KCR
KCR : తెలంగాణ భవన్ లో మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సమీక్ష కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ లో మాలోతు కవితల కు మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ క్రమంలో నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు చెప్పారు. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. పార్టీ వీడి వెళ్లే నేతలతో బిఆర్ఎస్ పార్టీకి నష్టం లేదన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాల్లో ఒడిదుదుకులు తప్పలేదు. మనమెంత మనకు ఒడిదుడుకులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది. కాంగ్రెస్ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిని నియమించారు. మనం ప్రజలకు చేయాల్సింది చేశాము. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ప్రజలకు మన విలువ తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఒడిపోయింది. కానీ తిరిగి మళ్లీ పుంజుకుంది. దళితబంధు ఎన్నికల కోసం తేలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితబంధును ఓ విజన్ కోసమే తెచ్చానన్నారు.