»Nita Ambani Nita Ambani In Sons Wedding Talk Of The Town Diamond Necklace
Neetha Ambani: కొడుకు పెళ్లిలో నీతా అంబానీ.. టాక్ ఆఫ్ ది టౌన్ గా డైమండ్ హారం..!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జమ్నా నగర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నీతా అంబానీ తన అద్భుతమైన దుస్తులు, ఆభరణాలతో అందరినీ ఆకట్టుకున్నారు.
Neetha Ambani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జమ్నా నగర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నీతా అంబానీ తన అద్భుతమైన దుస్తులు, ఆభరణాలతో అందరినీ ఆకట్టుకున్నారు. హస్తాక్షర ఈవెంట్లో నీతా అంబానీ ధరించిన మనీష్ మల్హోత్రా చీర, డైమండ్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించాయి. నీతా అంబానీ ధరించిన కాంచీపురం చీరకు జతగా పచ్చలు పొదిగిన వజ్రాల హారం చాలా అందంగా ఉంది. ఈ హారంలో రెండు పెద్ద లాకెట్టులు, పచ్చలు ఉన్నాయి. మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులు, బ్యాంగిల్స్, రింగ్ కూడా ధరించారు. ఈ నెక్లెస్ విలువ కోటి రూపాయలు దాటి ఉండవచ్చని అంచనా.
మార్చి 3, 2024న జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ముగింపు కోసం నీతా అంబానీ ధరించిన చేనేత కాంచీపురం చీర, పచ్చ హారం కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ చీరను రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్తో కలిసి ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. చీరలో స్కాలోప్డ్ బార్డర్లపై క్లాసిక్ సాంప్రదాయ జర్దోసీ వర్క్ ఉంది. చీర స్లీవ్లకు ప్రత్యేకమైన గోటా వర్క్ ఉంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలో మొదటి రోజు కోసం నీతా అంబానీ ధరించిన వైన్ కలర్ గౌను, పచ్చ-పొదిగిన వజ్రాభరణాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. నీతా అంబానీ తన అద్భుతమైన దుస్తులు, ఆభరణాలతో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హైలైట్గా నిలిచారు.