»Isro Chairman Somanadh I Got To Know That I Have Cancer That Day
ISRO Chairman Somanadh: నాకు క్యాన్సర్ ఉన్నట్లు ఆ రోజే తెలిసింది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు.
ISRO Chairman Somanadh: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య-ఎల్ 1 మిషన్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన రోజునే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని సోమనాథ్ తెలిపారు. టార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాన్ని సోమ్‌నాథ్ బయటపెట్టారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియదన్నారు.
ఆదిత్య-ఎల్1 మిషన్‌ను ప్రారంభించిన రోజునే తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. 2023 సెప్టెంబర్ 2న భారత మొదటి సౌర మిషన్ ప్రారంభించిన కొద్దిసేపటికే ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. అంతకుముందు రొటీన్ స్కాన్ చేయించుకోగా కడుపులో క్యాన్సర్ వంటిది ఏదో ఉందని నిర్ధారణ అయింది. ఆపరేషన్ అనంతరం ఆయన కీమోథెరపీ కూడా చేయించుకుని చెన్నైకి వెళ్లారు.