»Brs Party Dharnas Across Telangana On 6th Of This Month
KTR: ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు
ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.
KTR: ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ నేతలు మాట మార్చిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీడియో ఆధారాలతో వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20 వేల కోట్లు సంపాదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరిని ఆయన ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల నుంచి రూ.20 వేల కోట్ల రూపాయల దోపిడీకి మీరు వేసిన ఎత్తుగడ ఇది అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.