WNP: పట్టణంలోని పలు కాలనీలలో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. మర్రికుంటలోని ఓ రెస్టారెంట్ ముందురోడ్డులో గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైనే వర్షపు నీరు నిలువడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి జే.వి.స్వామి కోరారు.