»Narendra Modi Government Failed Says Telangana Ministers
Harish Rao Fire On Modi ఇక్కడ ధోఖా.. అక్కడ సక్సెస్
తెలంగాణకు మోడీ ప్రభుత్వం ధోఖా ఇచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను తూర్పారబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మరో సత్యవతి రాథోడ్ తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోశారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం ధోఖా ఇచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను తూర్పారబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మరో సత్యవతి రాథోడ్ తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా ధోఖాల కేంద్ర ప్రభుత్వమని మంత్రి హరీశ్ రావు విమర్శించగా.. ప్రగతి భవన్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
మతపిచ్చి రేపడంలో డబుల్ సక్సెస్
‘అంతా ధోఖాల కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల విషయంలో ధోఖా. అర్హులైన వారందరికీ ఇండ్లపై ధోఖా. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ధోఖా. పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తీసుకొస్తామని ధోఖా. నదుల అనుసంధానంపై కేంద్రం ధోఖా చేసింది’ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇక దేశాన్ని సరికొత్త అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ సాధించిందని ఎద్దేవా చేశారు. కేంద్రం ఏ విషయాల్లో విజయవంతమైందో మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేస్తూ ప్రసంగం కొనసాగించారు. ‘జీడీపీని మంటగలపడంలో సక్సెస్. ఆహార భద్రతను నాశనం చేయడంలో సక్సెస్. రూ.160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో సక్సెస్. సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో సక్సెస్. ఆకాశాన్ని తాకేట్టు సిలిండర్ ధర పెంచడంలో సక్సెస్. పసిపిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో సక్సెస్. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో సక్సెస్. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో సక్సెస్. రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో సక్సెస్. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో సక్సెస్. ఆదానీ ఆస్తులు పెంచడంలో సక్సెస్. రొటేషన్ లో వచ్చే G-20 ప్రెసిడెంట్ షిప్ ను తమ ఘనతగా చెప్పుకోవడంలో సక్సెస్. మతపిచ్చి మంటలు రేపడంలో డబుల్ సక్సెస్’ అని మంత్రి హరీశ్ రావు కేంద్రం తీరును తూర్పారబట్టారు.
మా పథకాలన్నీ కేంద్రం కాపీ
ఇక తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపీ కొడుతోందని మంత్రి హరీశ్ రావు వివరించారు. ‘మా పథకాలు కేంద్రం కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తున్నది. మన మిషన్ కాకతీయ.. అమృత్ సరోవర్, మిషన్ భగీరథ- హర్ ఘర్ కో జల్, రైతు బంధు- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రతి జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాల.. కేంద్రం కూడా ఇదే ప్రకటించింది. కంటి వెలుగు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అమలు చేస్తున్నారు. మన పథకాలన్నీ దేశం, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాయి. ప్రజలు గుర్తించారు. మీరు కూడా ప్రజలతో ఉంటే బాగుంటరు. లేకపోతే ప్రజలే తేలుస్తరు’ అని మంత్రి హరీశ్ రావు బీజేపీ నాయకులకు హెచ్చరించారు.
రేవంత్ పీసీసీ పదవికి అనర్హుడు
ప్రగతిభవన్ ను పేల్చి వేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్యవస్థ మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది. అనర్హుడికి పీసీపీ పదవి ఇచ్చారు. ఇలాగే రేవంత్ మాట్లాడితే బయట తిరగలేడు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నావ్… ఒళ్లు దగ్గర ఉంచుకొని మాట్లాడాలి. ప్రజలకు, నక్సలైట్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మానుకోటలోనే రేవంత్ యాత్ర అగిపోవాల్సి వస్తుంది’ అని మంత్రి సత్యవతి రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.