Amaravati: రాజధాని ద్రోహి గోబ్యాక్.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం
అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు సెగ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు తగిలింది. అమరావతిని కాదని విశాఖపట్టణాన్ని రాజధానిగా మార్చడంపై గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రాజధాని ప్రాంతం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆర్కే స్థానిక ప్రాంతానికి అన్యాయం చేశారని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తన నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం అబేడ్కర్ నగర్ లో బుధవారం ఎమ్మెల్యే ఆర్కే పర్యటించారు. నీటి సమస్యను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాగా స్థానిక ప్రజలు ఆందోళన తెలిపారు. అమరావతిని కాదని విశాఖను రాజధానిగా ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గో బ్యాక్.. అమరావతి ద్రోహి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని ద్రోహి ఎమ్మెల్యే ఆర్కే డౌన్ డౌన్.. దళిత ద్రోహి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున స్థానికులు నినాదాలు చేశారు. ఊరినంత దోపిడీ చేశారని, ఓట్లు వేయించుకుని తమకు అన్యాయం చేశారని గ్రామస్తులు విమర్శించారు. అయితే వారి నిరసనను పట్టించుకోకుండానే ఎమ్మెల్యే ముందుకు కదిలారు. అయితే వీరి నిరసనతో ఎమ్మెల్యే ఓ ఐదు నిమిషాలు కూడా గ్రామంలో పర్యటించలేదు. వెంటనే కారు ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు.
2015 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంటూ అమలు కాని విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నాడు. కర్నూలు, అమరావతి, విశాఖపట్టణం అంటూ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పాడు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నాడు. ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది. అయినా కూడా సీఎం జగన్ వీటిని పట్టించుకోకుండా ‘విశాఖ రాజధానిగా కాబోతుంది. త్వరలో నేను కూడా అక్కడికి మకాం మార్చబోతున్నా’ అని ఇటీవల ప్రకటించాడు. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న జగన్ మాట్లాడడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో అమరావతి ప్రాంతంలో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు రాజధాని మార్చి తమకు తీవ్ర అన్యాయం చేశాడని మండిపడుతున్నారు.
రాజధాని మార్పుతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. స్థానికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యే ఇరుకున పడ్డాడు. రాజధాని ప్రాంతవాసులకు సంజాయిషీ ఇచ్చుకోలేక ఇంటికి పరిమితమవుతున్నాడు. లేదంటే హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఈ పరిణామం స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందికరంగా మారింది. రాజధానికి ద్రోహం చేసిన ఎమ్మెల్యే ఆర్కేను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడించి తీరుతామని అమరావతి రాజధాని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కాగా అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.