HYD: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బీ.ఆర్. అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్ను నిర్మిస్తున్నామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడారు. అలాగే నింబోలి అడ్డాలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికి తగినన్ని నిధులు కేటాయించామన్నారు.