NZB: గ్రామ వనరులైన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు, ప్రజలు శుక్రవారం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామంలో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు.
NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
WGL: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి మహత్తర విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఎంపీ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.
ములుగు మండలంలోని పలువురు ముస్లిం సోదర, సోదరీమణులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ములుగు మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను ఇస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నేతలు ఉన్నారు.
BHNG: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జనన-మరణ నమోదు, వేసవిలో తాగునీటి సరఫరా, వీధి కుక్కల నియంత్రణ వంటి విషయాలపై చర్చించారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంఘం అధ్యక్షునిగా కుంబాల సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా కుంభాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో సంఘ అభివృద్ధికి పాటు పడతానని సంఘం పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలములోని అన్ని గ్రామాల రెడ్డి కుల బాంధవులకు, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు
NZB: రంజాన్ పండుగను పురస్కరించుకొని మోతే గ్రామంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా పరంజ్యోతి కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక లౌకిక దేశమని, ఇక్కడ ప్రతి మతానికి సమాన గౌరవం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, సలీం, జయవర్ధన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
NRPT: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతీక్ జైన్‌ను ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఆయనకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని వారు ఆకాంక్షించారు.
MDCL: ఘట్‌కేసర్ ప్రాంతం వైపు రియల్ ఎస్టేట్ గత 3 నెలలుగా పుంజుకుంటున్నట్లుగా ‘రేరాసేమ్’ సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కొనసాగుతుండగా, ఇది పూర్తయితే ఘట్‌కేసర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లడం కేవలం గంటన్నర సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంత నివాసితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.
MNCL: జైపూర్ మండలంలోని కిష్టపూర్ గ్రామంలో శుక్రవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. వాటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని సూచించారు.
MHBD: తొర్రూరు మండలంలోని దుబ్బతండా, కర్రెబీక్య తండా అంగన్వాడి కేంద్రాలపై HIT TVలో ప్రచురితమైన వార్త కథనానికి సీడీపీవో కమలాదేవి శుక్రవారం అంగన్వాడి కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. లబ్ధిదారులకు పాలు, గుడ్లు, పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని, టీచర్లు హాజరుకాకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంగన్వాడి టీచర్ గైర్హాజరుపై వివరాలు సేకరించారు.
JGL: మెట్‌పల్లి కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు కోర్టు భవనాల సూచిక బోర్డును ప్రారంభించారు. కోర్టుకు వచ్చే ప్రజలకు ఇది ఉపయోగకరమని తెలిపారు. బార్ అసోసియేషన్ సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్ జడ్జి నారం అరుణ్ కుమార్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
NRML: ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా ఇంఛార్జ్ ఏఎస్పీ సాయికిరణ్ హెచ్చరించారు. భైంసాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను భైంసా టౌన్ సీఐతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు. అనంతరం అక్రమ ఇసుక నిల్వలపై సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.
MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య కలిసి మైనారిటీలకు నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేదల పండుగ సంతోషం కోసం ఈ తోఫాను అందిస్తోందని వారు పేర్కొన్నారు.