SRPT: సూర్యాపేట మండలం ఇమ్మంపేటలో 62 మంది బేడ బుడగ జంగాలకు ఇళ్ల పట్టాలిచ్చి, స్థలాలు చూపడం లేదని హక్కుల దండు అధ్యక్షుడు బాణాల వెంకన్న మండిపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, వెంటనే తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.