GNTR: గుంటూరు కొత్తపేట కృష్ణమహల్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ బార్ వద్ద 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అలాగే జీజీహెచ్ వద్ద 50 నుంచి 55 ఏళ్ల వయసున్న అజ్ఞాత మహిళ అపస్మారక స్థితిలో పడివుండి మరణించింది. ఈ రెండు మృతదేహాలను పోలీసులు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.