కృష్ణా: మచిలీపట్నంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినాన్ని మతసామరస్యానికి ప్రత్యేకగా జరుపుకుంటూ, అందరితో సోదర భావంతో మెలుగుతూ, ఘర్షణలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.