SRCL: మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని ముస్తాబాద్ మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు బొప్ప నర్సయ్య అన్నారు. ముస్తాబాద్‌లో మున్నూరు కాపులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. కాపులు బీసీ జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ చైతన్యంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. అందరు ఐక్యంగా ఉండి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.