KMM: విద్యార్థుల భోజన వసతికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిరంతరం గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని వైరా మున్సిపల్ వైస్ ఛైర్మన్ సంతోష్ స్పష్టం చేశారు. వైరా మండలంలోని గురుకుల పాఠశాలలు, సాధారణ ప్రజలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రానీయవద్దని సూచించారు. శుక్రవారం ఆయన సోమవరం వద్ద ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ను సందర్శించి ప్రతినిధులతో మాట్లాడారు.