KMM: జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదానికి గురైన కార్మికుడు పర్వేష్కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు రూ. 31.31 లక్షల నష్టపరిహారపు చెక్కును అందజేశారు. కార్మిక నష్టపరిహార చట్టం కింద సంబంధిత యాజమాన్యం ఈ మొత్తాన్ని చెల్లించింది. పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగినా కార్మికులు వెంటనే జిల్లా కార్మిక శాఖను సంప్రదించాలని సూచించారు.