AP: తాడిపత్రిలో ఓ వ్యక్తి మటన్ ఉడకలేదని వంట పాత్రతో పోలీస్ స్టేషన్కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఉగాది సందర్భంగా కొన్న మాంసాన్ని ఎన్నిసార్లు ఉడికించినా ఉడకకపోవడంతో సదరు విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు చేరుకున్నాడు. ఈ విషయం విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురై ఆ వ్యక్తికి సర్దిచెప్పి పంపించారు. ఈ వింత ఘటన స్థానికంగా నవ్వులు పూయించింది.