• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శివాలయంలో సీఐ ప్రత్యేక పూజలు

RR: శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో ఆదివారం అల్లాదుర్గ సీఐ రేణుక రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం సంతోషకరమని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి ఫోటోను సీఐకు అందజేశారు.

April 5, 2026 / 06:38 PM IST

ఖమ్మంలో భట్టి కుమారుడి వివాహ రిసెప్షన్‌

ఖమ్మం: YSR కాలనీ గ్రీన్ హిల్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ రిసెప్షన్‌ ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. అతిథుల కోసం పకడ్బందీగా భోజన వసతులు, భారీ బందోబస్తు మధ్య ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశారు.

April 5, 2026 / 06:37 PM IST

బీజేపీ నూతన అధ్యక్షుల నియామకం

KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ హుజురాబాద్ రూరల్, జమ్మికుంట రూరల్ మండల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించినట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షులుగా చింతం శ్రీనివాస్, హుజురాబాద్ రూరల్ అధ్యక్షులుగా పారిపల్లి కొండల్ రెడ్డి, జమ్మికుంట రూరల్ అధ్యక్షులుగా దొంతన వేణి రమేష్లను నియమించారు.

April 5, 2026 / 06:32 PM IST

నేతన్నలను ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి

NLG:టెస్కో ద్వారానే యూనిఫాం ఆర్డర్లు ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేనేత సంఘాల బాధ్యులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలకు టెండర్లు ఇవ్వడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

April 5, 2026 / 06:31 PM IST

జేసీబీ, ఐదు ట్రాక్టర్లు సీజ్

SRD: కొండాపూర్ మండలం గారకుర్తి వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఎస్సై సోమేశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం దాడులు నిర్వహించారు. ఒక జేసీబీ, ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇసుకను సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామానికి తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

April 5, 2026 / 06:30 PM IST

కేసీఆర్ మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు: మాజీ మంత్రి

MBNR: గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని జిల్లా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. HYDలోని తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఈ దాడి నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ అరాచకాలను కేసీఆర్ భరించడం ఆయన గొప్పతనమని, ఆయన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు.

April 5, 2026 / 06:30 PM IST

కంపెనీలో చోరీ.. PSలో ఫిర్యాదు

MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి శివారులోని శ్రీ రాజ్ అల్యూమినియం కంపెనీలో చోరీ జరిగినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఈ నెల 4న రాత్రి గుర్తు తెలియని దొంగలు గోడ దూకి, సెక్యూరిటీ గార్డ్ రమాకాంత్ శర్మ విధుల్లో ఉండగానే విలువైన అల్యూమినియం ఇంగోట్లను ఎత్తుకెళ్లారు. కంపెనీ సూపర్వైజర్ ఉమామహేశ్వర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

April 5, 2026 / 06:30 PM IST

మల్లన్నను దర్శించుకున్న సైబరాబాద్ ఏసీపీ

SDPT: ప్రసిద్ధ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సైబరాబాద్ ఏసీపీ బి.శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 06:30 PM IST

బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి:ఎస్పీ

NRPT: ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.సామాజిక అసమానతలకు ఎదురు చెబుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ అని అన్నారు.

April 5, 2026 / 06:30 PM IST

అంబేద్కర్ విగ్రహ దిమ్మె కూల్చివేత.. పోచంపల్లిలో ఉద్రిక్తత

BHNG: పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో దుండగులు బరితెగించారు. ఏప్రిల్ 14న ప్రతిష్టించాల్సిన అంబేద్కర్ విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెను రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘటనపై మాల కులాల యునైటెడ్ ఫోరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విగ్రహ దిమ్మెను ధ్వంసం చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది.

April 5, 2026 / 06:25 PM IST

సామాజిక విప్లవానికి నాంది జగ్జీవన్ రామ్: సీఎండీ

HNK: నగరంలోని నక్కలగుట్టలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడని, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.

April 5, 2026 / 06:24 PM IST

ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ADB: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పీఎంఈజీపీ, ముద్రా వంటి పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పాడి పశువులు, సోలార్ ఫామ్స్ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.

April 5, 2026 / 06:24 PM IST

పేదల సొంతింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే

KMM: నిరుపేదల సొంతింటి కల పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరిందని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. వేంసూరు మండలం భరణిపాడులో లబ్ధిదారులు వెంకటేశ్వరరావు, సంధ్యారాణి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆమె ప్రారంభించి, గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే కృషి చేస్తుందని ఆమె అన్నారు.

April 5, 2026 / 06:24 PM IST

జిల్లాలోని సమస్యలపై CM స్పష్టతనివ్వాలి: MRPS

ADB: ఈనెల 6న భజరహత్నూర్ పిప్పిరి గ్రామంలో పర్యటించనున్న CM రేవంత్ రెడ్డి జిల్లాలోని సమస్యలపై స్పష్టతనివ్వాలని MRPS జిల్లాధ్యక్షుడు మల్లేష్ అన్నారు. ఇవాళ ఇచ్చోడ మండలంలో సమావేశమై మాట్లాడారు. కుప్టి ప్రాజెక్టు, యూనివర్సిటీపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. సిరిచెల్మ గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, పర్యాటకంపై దృష్టి సారించాలని కోరారు.

April 5, 2026 / 06:17 PM IST

కలెక్టర్‌ను కలిసిన గ్రంథాలయ సంస్థ నూతన ఛైర్మన్

ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ ఇవాళ జిల్లా కలెక్టర్ హరితను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను శాలువాతో సత్కరించగా అతి చిన్న వయసులో పదవి చేపట్టినందుకు కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, పాఠకులకు మెరుగైన వసతులు కల్పిస్తానన్నారు.

April 5, 2026 / 06:17 PM IST