PDPL: రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు 21 వస్తువులతో కూడిన విద్యార్థి కిట్లు ఉచితంగా అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజారాం తెలిపారు. ఇవాళ ఆయన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో మాట్లాడారు. కావున తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
MDCL: అల్వాల్‌కు చెందిన గన్నమనేని ప్రణతిరావు మిస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీలలో ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డిని కలిసి మద్దతు కోరారు. ఎమ్మెల్యే అభినందనలు తెలియజేస్తూ ఏప్రిల్ 4న జరగనున్న ఫైనల్స్‌లో ప్రణతిరావుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
WGL: వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో పర్యటక ప్రాంతాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఖిలా వరంగల్ కోట, పాకాల సరస్సు, భద్రకాళి గుడి వద్ద సందర్శకులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖిలా వరంగల్లో కాకతీయుల నాటి కట్టడాలు, చిల్డ్రన్ పార్కు, చెరువు, కుష్ మహల్ ఉండగా.. పచ్చని చెట్ల మధ్య పాకాల, సిటీ మధ్యలో భద్రకాళి గుడి ఉంది.
BHNG: భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ క్యామ మల్లేష్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. ర్యాకల శ్రీనివాస్, బాతుక అశోక్, ఎదునూరి చంద్రయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. 2, 14వ వార్డుల్లో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సభల్లో ఆయన పాల్గొన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ సభలని పేర్కొన్నారు.
SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహిత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తన భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఇవాళ ఆయన కర్బుజా కాయపై హనుమంతుని రూపాన్ని అత్యంత అద్భుతంగా చిత్రించి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు.
HNK: ఐనవోలు మండలం పున్నేలు శివారులోని స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఫరహన ఆమె ఇద్దరు కుమార్తెలు మృతి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ అంకిత్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల వ్యవస్థను అధికారులు సమీక్షించారు.
MNCL: తాతయ్య అంత్యక్రియలకు వెళ్లి మనుమడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దేవన్న గురువారం తన తాత మరణించడంతో కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ దేవన్నకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు వెంటనే ఆయనను లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
KNR: జమ్మికుంట మండలంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మికుంట నుంచి HZB మండలం పోతిరెడ్డిపేటకు వెళ్తున్న ఆటో పెద్దంపల్లి మూల మలుపు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తేలుకుంట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పోలీస్ జిమ్ సెంటర్‌ను CP సన్ ప్రీత్ సింగ్ సందర్శించి జిమ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాయమ సామగ్రిని పరిశీలించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకై ఏర్పాటు చేయాల్సిన జిమ్ సామాగ్రిపై అధికారులతో సీపీ కాసేపు చర్చించారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
BHPL: టెండర్ విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతిలోనే చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని మాజీ MLA గండ్ర వెంకటరమణ డిమాండ్ చేశారు. టేకుమట్ల మండల కేంద్రంలో గురువారం ఆయన పర్యటించి, చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌కి కాల్ చేసి, టెండర్ రద్దు చేయాలని కోరారు.
KMM: కూసుమంచి గన్యతండకు చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలోకి గురువారం చేరారు. ముందుగా తండాలోని సేవలాల్ మహారాజ్, మేరమ్మ యాడి నూతన ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ప్రజా ప్రభుత్వమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని వారు విమర్శించారు.
MHBD: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన- 2027 కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు సీనియారిటీ ప్రాతిపదికన విధులు కేటాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) సభ్యులు కోరారు. గురువారం కొత్తగూడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక MROకు వారు వినతిపత్రం ఇచ్చారు. జనగణన విధుల కేటాయింపులో గర్భిణీ స్త్రీలు,100% వైకల్యం ఉన్న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు.
BDK: ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. గురువారం అశ్వాపురం మండలం నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. గ్రామ అభివృద్ధిలో మీరు, మేము, మనం అందరం భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీవో, ఎంపీఓ పాల్గొన్నారు.
NLG: 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంతో హాలియా 12 వార్డుల రూపురేఖలు మారాయి. ముఖ్యంగా జడ్చర్ల-కోదాడ, మాచర్ల-నల్గొండ హైవేల వెంట పేరుకుపోయిన మట్టి, కంకరను మున్సిపల్ సిబ్బంది తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. నెలలుగా ప్రయాణికులకు నరకం చూపించిన గుంతలను డాంబర్‌తో పూడ్చివేయడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.